
గజ్వేల్, వెలుగు: భూ తగాదాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యచేసుకున్నాడు. గజ్వేల్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ ప్రసన్ననగర్కు చెందిన శ్రీరామ్ మల్లేశం(59) కు అదే కాలనీలోని ఓ కుటుంబంతో భూమి విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగు తున్నాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెబుతూ ఆవేదన చెందేవాడు. సోమవారం మల్లేశం గజ్వేల్ పట్టణంలోని సాయిబాబా గుడి దగ్గర పురుగు మందు తాగిపడిపోయాడు.
స్థానికులు డయల్ 100కు కాల్ చేసి సమచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మల్లేశం ను ప్రభుత్వ ఆసుప త్రిలో చేర్పించారు. కాగా అతడు చికిత్స పొందుతూ కొంతసేపటికి చనిపోయాడు. కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.