360 డిగ్రీస్ లో ఒకే తీర్పు .. ఇది మామూలు విక్టరీ కాదు

360 డిగ్రీస్ లో ఒకే తీర్పు .. ఇది మామూలు విక్టరీ కాదు

మున్సిపల్ ఎన్నికల్లో  రాష్ట్ర వ్యాప్తంగా 360 డిగ్రీస్ లో ఒకే రకమైన రిజల్ట్ ఇచ్చారన్నారు సీఎం కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై  తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. గత ఆరేళ్లుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ప్రజలు తమను ఆదరించారన్నారు.  మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు ప్రోత్సహించిన తెలంగాణ ప్రజానీకానికి  శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు.  గెలుపు కోసం పనిచేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా కేటీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా..  ఇది మామూలు విక్టరీ కాదు. ఇలాంటి సందర్భాల్లో మున్సిపల్లో  ఎన్నికల్లో విజయం సాధారణ విషయం కాదన్నారు కేసీఆర్.