కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తాం : కేసీఆర్

కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తాం : కేసీఆర్

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..  ఉద్యోగులకిచ్చిన మాటను నెరవేరుస్తామని అన్నారు. పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు లాంటి వాటిపై సంఘాలతో చర్చించి ప్యాకేజీగా ఇస్తామన్నారు కేసీఆర్. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు.

కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.  గత ప్రభుత్వాల్లో నిష్ర్ర్కియాపరంగా ఉన్న చట్టాన్ని ఇప్పుడు క్రియాశీలం చేస్తామని అన్నారు. వచ్చే కేబినెట్ కు  అప్పగించే అధికారాలపై నిర్ణయిస్తామని ఆయన అన్నారు. వీలైనంత త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని, కొత్త మున్సిపల్ చట్టం తెస్తామని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సినీ పరిశ్రమ  కోసం డైరెక్టర్ ఎన్.శంకర్ కోరిక మేరకు 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఎకరాకు రూ.5 లక్షల రేటు చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. శారదా పీఠానికి 2 ఎకరాల కేటాయిస్తామని, ఆ స్థలాల్లో వారు విద్యాసంస్థలు కూడా పెడతారని సీఎం అన్నారు. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం 30 జిల్లాల్లో స్థలాలను కేటాయించామన్నారు కేసీఆర్.