పంజాబ్ కో న్యాయం..తెలంగాణకో న్యాయమా?

పంజాబ్ కో న్యాయం..తెలంగాణకో న్యాయమా?

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.." యాసంగిలో వరి వేయాలని సంజయ్ చెప్పారా..లేదా?. యాసంగిలో వడ్లు వెయ్యాలన్న మాటపై సంజయ్ నిలబడతడా?. తప్పు చెప్పామనుకుంటే రైతులకు సంజయ్ క్షమాపణ చెప్పాలి. FCI కొంటా అంటుంటే..కేంద్రం నిరాకరిస్తుంది. ప్రశ్నించిన రైతులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. టీఆర్ఎస్ లో రైతులు లేరా..వాళ్లు ధాన్యం అమ్ముకోడానికి రారా. బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాల దగ్గర డ్రామా పెడదామని బయల్దేరారు. రైతు ప్రయోజనాలు కాపాడే పద్దతిలో కేంద్రం లేదు. బఫర్ స్టాక్ పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే. వరి కొనుగోలులో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు. కేంద్రం తీరుతోనే వరి పండించొద్దని చెప్పాం. వర్షాకాల పంట కూడా తీసుకుంటారో లేదో కేంద్రం చెప్పడంలేదు. పంజాబ్ లో కొన్నట్లు రాష్ట్రంలో కొంటరా లేదా చెప్పాలి. రాష్ట్రానికో తీరుగా కేంద్రం వ్యవహరిస్తుంది. వడ్లు నిల్వ చేసే అవకాశం ఏ రాష్ట్రానికి లేదు. ఏడాదికి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కేంద్రాన్ని అడిగాం. బీజేపీ నేతలను రైతులే నిలదీస్తున్నారు" అన్నారు సీఎం కేసీఆర్.