జన నాయగన్ మూవీకి హైకోర్టులో బిగ్ షాక్.. సంక్రాంతి రేసు నుంచి దళపతి సినిమా పూర్తిగా ఔట్..!

జన నాయగన్ మూవీకి హైకోర్టులో బిగ్ షాక్.. సంక్రాంతి రేసు నుంచి దళపతి సినిమా పూర్తిగా ఔట్..!

హైదరాబాద్: దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) మూవీకి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‎లో బిగ్ షాక్ తగిలింది. జననాయగన్‌ సినిమాకు U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్‌ ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. కేసు తదుపరి విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో జన నాయగన్ మూవీ సంక్రాంతి రేసు నుంచి అఫిషియల్‎గా ఔట్ అయ్యింది. 

విజయ్ జన నాయగన్ మూవీకి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్‌ జారీ చేయలేదు. దీంతో సీబీఎఫ్‎సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జన నాయగన్ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCను ఆదేశించింది. 

►ALSO READ | Akhanda 2 OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బాలయ్య ‘అఖండ 2: తాండవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌‎లో ఛాలెంజ్ చేసింది. CBFC అప్పీల్‌ను శుక్రవారం (జనవరి 9) విచారించిన డివిజన్ బెంచ్..  జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ నిర్ణయంతో విజయ్ జన నాయగన్ మూవీ పొంగల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నట్లైంది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.