
సీఎం కేసీఆర్ తిరుపతి చేరుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో వెళ్లిన కేసీఆర్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వైసీపీ ఎమ్మెల్యేలు , స్థానిక అధికారులు ఎయిర్ పోర్టులో కేసీఆర్ ను రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి తిరుమల వెళ్లారు కేసీఆర్. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిధి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు కేసీఆర్. దర్శనం అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు సీఎం. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.