దళితుల్లో పేదవాళ్ళు ఉండకుండా చేస్తా

దళితుల్లో పేదవాళ్ళు ఉండకుండా చేస్తా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దళితుల్లో పేదరికం అనేది లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి రానున్న రోజుల్లో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. దళిత సాధికారత పథకానికి తోడుగా రానున్న రోజుల్లో కార్పస్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన సీఎంను దళిత మేధావులు, ప్రొఫెసర్లు సోమవారం ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై సీఎంవో ప్రకటన రిలీజ్ చేసింది. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కోరంగాన్ని చక్కదిద్దుకుంటూ పోతున్నామని తెలిపారు. ఫలితంగా అందరితో పాటు దళితుల జీవితాలు కూడా మెరుగుపడ్డాయని, అయినా వారికోసం ఇంకా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ప్రత్యేక శ్రద్ధతో బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళిత సాధికారత సాధించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామన్నారు.పథకం రూపొందించడంతోపాటు దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన సపోర్టివ్ మెకానిజాన్ని మనమే తయారు చేసుకోవాలని సీఎం సూచించారు.