డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు

డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ విషయంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను  తిరస్కరించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ ఎక్సైజ్ శాఖతో జరిపిన సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం.

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో నుంచి కూడా సమూలంగా నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమన్నారు. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సదస్సులో మంత్రులతో పాటు  అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తి