29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తి 

29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తి 

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలు కొవిడ్ బారినపడకుండా వారిని చైతన్యపరుస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 29 జిల్లాల్లో 77లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వే పూర్తి చేసినట్లు ఆయన ప్రకటించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటలో క్యాథ్ లాబ్, ట్రామా కేర్ యూనిట్లను హరీష్ రావు ప్రారంభించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామన్న ఆయన.. 88 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుస్టర్ డోస్ ల కాల వ్యవధిని తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ సర్కారు అందుకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తోందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో రెండో మదర్ మిల్క్ బ్యాంక్ ను ఖమ్మంలో ప్రారంభించామన్న మంత్రి.. త్వరలోనే కీమో, రేడియో థెరపీ సేవలను ప్రారంభిస్తామని అన్నారు. 

For more news..

ప్రపంచానికి మరో కొత్త వైరస్ భయం

అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం