కరోనా కన్నా ప్రమాదకరంగా కొత్త వైరస్

కరోనా కన్నా ప్రమాదకరంగా కొత్త వైరస్

కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ప్రపంచదేశాలకు చైనా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. కొత్త రకం కరోనా నియో కోవ్ తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్ సైటిస్టులు ఈ విషయాన్ని ప్రకటించారు. అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ కొత్త రకం కరోనా కారణంగా మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతుందని హెచ్చరించారు.

ప్రతి ముగ్గురిలో ఒకరి మరణం

నియోకోవ్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది. నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని స్పుత్నిక్ నివేదిక చెబుతోంది. 2012 -15 మధ్యకాలంలో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్ కు నియోకోవ్ కు సంబంధం ఉందని అంటోోంది. తొలుత దక్షిణాఫ్రికా గబ్బిలాల్లో గుర్తించిన ఈ  నియోకోవ్ వైరస్ ఇప్పటి వరకు మనుషులకు సోకలేదని సైంటిస్టులు చెప్పారు. ప్రస్తుతానికి జంతువుల నుంచి జంతువులకు మాత్రమే నియోకోవ్ సోకుతుండగా.. వైరస్ వస్తున్న మ్యూటేషన్ల కారణంగా మనుషులకు సోకే ప్రమాదం పొంచి ఉందని వూహాన్ సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ తరహాలోనే ఇది కూడా అత్యంత వేగంగా మనుషుల్లో వ్యాపించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. 

అత్యంత వేగంగా వ్యాప్తి
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ తో కలిసి వూహాన్ యూనివర్సిటీ రీసెర్చర్లు చేపట్టిన ఈ అధ్యయన ఫలితాలను bioRxiv వెబ్ సైట్ లో ప్రచురించారు. సార్స్ కోవ్ 2 కన్నా వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ  వైరస్ నుంచి యాంటీ బాడీలు, ప్రొటీన్లు రక్షణ కల్పించలేవని సైంటిస్టులు చెబుతున్నారు.ఆ కారణంగానే నియోకోవ్ బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే అవకాశముందని అంటున్నారు.

For more news..

అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం

మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య