పోడు భూములకు రైతుబంధు ఇస్తం: కేసీఆర్

పోడు భూములకు రైతుబంధు ఇస్తం: కేసీఆర్

పోడు భూములకు రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సెక్రటేరియట్ లో రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించిన  కేసీఆర్ త్వరలోనే పోడు భూములకు పట్టాలిస్తామని..రైతు బంధు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.  దేశంలోనే రైతుకు పెట్టుబడి సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతు బంధుపథకం కేంద్రం కళ్లు తెరిపించిందన్నారుజ. ఏ పథకం వెనుకైనా మానవీయ కోణం ఉందన్నారు.

మన రాష్ట్రంలోని 23 గ్రామాలకు జాతీయ అవార్డులు వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకు 50  వేల మందికి దళితబంధు ఇచ్చామని చెప్పారు.  ఈ పదేళ్ల కాలంలో సమైక్య పాలనలో మూలపడ్డ  సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. కాళేశ్వరం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం అని అన్నారు.