
ధరణి పోర్టల్ లో జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. చిన్నచిన్న సమస్యలు తప్పా రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగోతందన్నారు. వ్యవసాయేతర భూముల విషయంలోనూ అలాంటి విధానమే రావాలని కోరారు. వివిధ కారణాలతో 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు వచ్చాయన్నారు సీఎం. ఇక ఆలస్యం ఉండొద్దని… సమస్యలు తొలగిపోయి సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వైభవంగా సాగుతోందని….. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా ఉండేలా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలన్నారు. పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారని…. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయన్నారు. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బందులున్నాయన్నారు. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్.