రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్..ఇంటి పన్ను రూ.100: కేసీఆర్

రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్..ఇంటి పన్ను రూ.100: కేసీఆర్

మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం ఆసక్తికర ప్రకటన

కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా బిల్లులో చేర్చిన అంశాలను వివరించారు. మున్సిపాలిటీల్లో 75 చదరపు గజాల్లోపు స్థలంలో నిర్మించిన నిరుపేదల G+1 ఇండ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్క రూపాయే ఉంటుందని సీఎం చెప్పారు. ఆ ఇంటికి ఏడాదిలో ఇంటి పన్ను రూ.100 ఉంటుందని చెప్పారు.

ఆగస్ట్ 15 నుంచి పరిపాలనలో సంస్కరణలు

ఇక నుంచి అక్రమ కట్టడం అంటే కూల్చడమే అని చెప్పారు కేసీఆర్. అది ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇంటిని కూల్చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి పరిపాలనలో సంస్కరణలు రాబోతున్నాయన్నారు కేసీఆర్.