కెనడాలో మాదిరిగా వరంగల్ ఆస్ప‌త్రి నిర్మాణం

V6 Velugu Posted on Jun 21, 2021

  • త్వరలోనే మామునుర్ లో ఎయిర్ పోర్ట్

వరంగల్ అర్బన్ : హైదరాబాద్ రేంజ్ లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద సిటీగా వరంగల్ ను అభివృద్ధి చేస్తానన్నారు సీఎం కేసీఆర్. సోమవారం ఆయన వరంగల్ లో పర్యటించారు. కొత్త కలెక్టర్ భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కలెక్టర్ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం అన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలన విభాగంలో పనులు త్వరగా జరగాలని అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని తెలిపారు. వరంగల్ , హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తూ అనుమతులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు కోసం మరో 2 ఎకరాల్లో భవన నిర్మాణం చేయాలన్నారు. రెండో క్యాపిటల్ సిటీగా వరంగల్ ను అభివృద్ధి చేస్తానన్నారు.

జిల్లాలో వెటర్నరీ యునివర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్న సీఎం.. రెవెన్యూ ప్రక్షాళనకు కృషి చేస్తానన్నారు. ధరణి ద్వారా త్వరగా రైతు సమస్యలు తీరుతున్నాయన్నారు.  ప్ర‌పంచంలో అత్యంత అధునాత‌న వైద్య స‌దుపాయాలు కెన‌డాలో ఉన్నాయ‌ని తెలిసిందని.. వైద్య‌శాఖ అధికారుల‌తో క‌లిసి కెన‌డాను విజిట్ చేసి.. వీడియోలు, ఫోటోలు చిత్రీక‌రించాలన్నారు. కెనెడాలో ఉన్న మాదిరిగా వరంగల్ లో ఆస్ప‌త్రి నిర్మాణం ఉండాలి తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల కేసులు పరిష్కారమవుతున్నాయన్నారు. వరంగల్ నగరం వైద్య, విద్య, విజ్ఞాన రంగంలో  ముందుండాలన్నారు. యంజియం, హాస్పటల్, సెంట్రల్ జైలు, మొత్తం స్థలాన్ని , వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్ గా అందుబాటులో ఉండాలన్నారు. డెంటల్ హాస్పటల్ ఏర్పాటుకు కృషి చేస్తానని.. మామునూర్ లో త్వరలోనే ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నా అన్నారు. వరంగల్ లో మంచి నీటి సమస్య లేదన్నారు సీఎం కేసీఆర్.

Tagged Warangal, CM KCR, , Mamunur Airport

Latest Videos

Subscribe Now

More News