డెడ్ బాడీలను ఇంటికి తీసుకెళ్లేందుకు వాహ‌నాలు

డెడ్ బాడీలను ఇంటికి తీసుకెళ్లేందుకు వాహ‌నాలు

హైదరాబాద్: ప్ర‌భుత్వ ద‌వాఖాన‌్లల్లో ఎవ‌రు చ‌నిపోయినా వారింటికి తీసుకెళ్లేలా వాహ‌నాలు ఏర్పాటు చేశామని తెలిపారు సీఎం కేసీఆర్. 50, 60 వాహ‌నాలు వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని సీఎస్ కు ఆదేశాలిచ్చామన్నారు. సోమవారం హైదరాబాద్ లో 3 టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలకు భూమి పేజ చేసిన అనంతరం అల్వాల్ సభలో మాట్లాడిన సీఎం.. వైద్య విధానాన్ని ప‌టిష్ఠ‌ప‌రిచే ల‌క్ష్యంతో ముందుకుపోతున్నామన్నారు. పేద‌రికం కార‌ణంగా ప్ర‌జ‌లు వైద్యానికి దూరం కాకూడ‌దన్న సీఎం కేసీఆర్..హెచ్​ఎండీఏ ప‌రిధిలో 1.64 కోట్ల జ‌నాభా ఉందన్నారు. గాంధీ, ఉస్మానియా కాకుండా మ‌రో 4 ఆస్ప‌త్రులు ఉండాల‌ని నిర్ణ‌యించామని చెప్పారు. ఎయిమ్స్ త‌ర‌హా ఆస్ప‌త్రులు మ‌న‌కు అందుబాటులోకి రాబోతున్నాయని.. అన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు, శ‌స్త్ర‌చికిత్స‌లు ప్ర‌జ‌ల‌కు అందుతాయని తెలిపారు. అల్వాల్ లోనే మ‌హిళ‌ల ప్ర‌సూతి వింగ్ ఏర్పాటు చేస్తామని.. హైద‌రాబాద్ న‌లుమూల‌లా వైద్య సేవ‌లు ఉచితంగా అందుతాయన్నారు.