నిరుద్యోగులు టీవీ చూడండి.. రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్త

నిరుద్యోగులు టీవీ చూడండి.. రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్త

నిరుద్యోగులు రేపు ఉదయం టీవీ చూడాలని సీఎం కేసీఆర్ చెప్పారు. నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని, రేపు ఉదయం పది గంటలకు టీవీ చూడాలని ఆయన అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పై వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా అభివృద్ధి చేసుకున్నామని, చివరి రక్తపు బొట్టు వరకూ తెలంగాణ కోసమే బతుకుతానని ఆయన చెప్పారు. 

‘‘దేశంలో గోల్‎మాల్ గోవిందంగాళ్లు మోపయ్యారు. దేశాన్ని ఆగంబట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలకు మతపిచ్చి, కులపిచ్చి లేపాలని చూస్తున్నరు. రాజకీయాలు మంటకలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బిడ్డగా.. నా కంఠంలో ప్రాణం ఉండగా.. అటువంటి అరాచకాలు తెలంగాణలో రానియ్యను. ఆ పోరాటానికి మనందరం సిద్ధంగా ఉండాలి’’ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా రూపుదిద్దుకున్నామని అన్నారు. సరికొత్త తెలంగాణ ఎలా ఆవిష్కృతమైందో రేపు అసెంబ్లీలో చెబుతానన్నారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని, వాళ్ల కోసం ప్రకటన చేయబోతున్నానని కేసీఆర్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన ప్రసన్న శ్రీ

సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు

గనిలో చిక్కుకున్న రవీందర్‎ను బయటకుతీసిన రెస్క్యూ టీం