19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన ప్రసన్న శ్రీ

19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన ప్రసన్న శ్రీ

మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నారీశక్తి అవార్డులను ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 29 మంది మహిళలు అవార్డులను అందుకున్నారు. 2020–21 సంవత్సరానికి గానూ ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్న శ్రీకి నారీ శక్తి అవార్డుల లభించింది. గిరిజన భాషలకు లిపి రూపొందించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. లిపిలేని 19 భాషలను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేసి.. లిపిని రూపొందించారు. ప్రపంచంలోనే  ఈ ఘనత సాధించిన తొలి మహిళ ప్రసన్న శ్రీ. ఆమె చేసిన కృషిని అభినందిస్తూ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాన్ని అందించారు.

అలాగే తొలి మహిళా స్నేక్ రెస్క్యూవర్ గా పేరు పొందిన వనితా జగ్దేవ్ బొరాడేకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి అవార్డును ప్రదానం చేశారు. మహారాష్ట్రలోని బుల్ధానాకు చెందిన ఆమె కొన్నేళ్లుగా ప్రమాదకరమైన స్నేక్ రెస్క్యూవర్ ప్రొఫెషన్ ను ఎంచుకుని తన సత్తా చాటుతున్నారు.

ఒడిశాకు చెందిన శ్రుతి.. దివ్యాంగులకు అండగా నిలిచేందుకు ఎన్జీవోను నిర్వహిస్తోంది. ‘‘క్రూసేడర్ ఇన్ వీల్ చైర్ (వీల్ చైర్ లో ఉన్న యోధురాలు)’’గా పాపులర్ అయిన శ్రుతి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నారీ శక్తి అవార్డును అందించింది.

మరిన్ని వార్తల కోసం..

సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు

గనిలో చిక్కుకున్న రవీందర్‎ను బయటకుతీసిన రెస్క్యూ టీం

మహిళా దినోత్సవం రోజే మహిళా ప్రజాప్రతినిధికి అవమానం