సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు

సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్‌పై హైకోర్టులో మంగళవారం ఉదయం ఆ పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే సస్పెషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలో రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారన్నారు. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని తెలిపారు.

సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని బీజేపీ నేతలు కోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలన్నారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్నారనే కారణంతో ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

మరిన్ని వార్తల కోసం:

ఐఫోన్లు వదిలి ‘అయ్యా’కు మారండి

రష్యాలో కార్యకలాపాలు నిలిపేసిన ఐబీఎం

ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్