ఐఫోన్లు వదిలి ‘అయ్యా’కు మారండి

ఐఫోన్లు వదిలి ‘అయ్యా’కు మారండి

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యాకు  ప్రముఖ మొబైల్ కంపెనీలు యాపిల్‌, శాంసంగ్‌ తోపాటు దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ షాక్ ఇచ్చాయి. తమ ఉత్పత్తులను రష్యాకు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా ఈ కంపెనీలకు దీటుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘అయ్యా టీ1’గా చెబుతున్నఈ మొబైల్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోద‌ట‌. అయ్యా టీ1ను ర‌ష్యాకు చెందిన స్కేల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్న స్మార్ట్ ఎకోసిస్టమ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఐఫోన్‌కు దీటుగా పనిచేసే ఈ స్వదేశీ మొబైల్ ను వినియోగించాల‌ని తమ పౌరుల‌కు ర‌ష్యా పిలుపునిచ్చింది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ లో యూజర్స్‌పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండడానికి కెమెరాలు, మైక్రోఫోన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసేలా ప్రత్యేక హార్డ్‌వేర్‌ బటన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. త‌మ‌పై నిఘా పెట్టాల‌నుకునే వ్యక్తుల ఫోన్ల మైక్రోఫోన్‌, కెమెరాల‌ను అయ్యా టీ1 స్వయంగా టర్న్ ఆఫ్ చేసేస్తుంద‌ట‌.ఈ మొబైల్ ధర సుమారు రూ.15 నుంచి రూ.19 వేల రూబెల్స్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ల తయారీలో ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మీడియాటెక్‌ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం:

బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన్రు

రష్యాలో కార్యకలాపాలు నిలిపేసిన ఐబీఎం

ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్