రాష్ట్ర కేబినెట్ లో మహిళా మంత్రులు లేరన్న విషయంపై సీఎం కేసీఆర్ ను అసెంబ్లీ లో ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. కనీసం ఒక మంత్రి పదవినైనా మహిళలకు కెటాయించాలని అన్నారు. ఈ విషయంపై స్పందించారు కేసీఆర్. రానున్న మంత్రి వర్గ విస్తరణలో రెండు మంత్రి పదవులను మహిళలకు కెటాయిస్తామని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడ్డ మొదటి కేబినెట్ లో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు కేసీఆర్ అంతగా స్పందించలేదు. ఈ సారి మాత్రం మహిళలకు మంత్రి పదవులు ఇస్తామనడంతో హర్షం వ్యక్తం చేశారు. మహిళలు అధికంగా తమ పార్టీకి ఓట్లు వేసినందుకే… టీఆర్ఎస్ పార్టీ రెండవసారి భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని కేసీఆర్ అన్నారు. మహిళలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
