
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు సీఎం కేసీఆర్.
అశేష భక్తజన సమూహం వెంటరాగా సమ్మక్క నిన్న(గురువారం) రాత్రి గద్దెపై కొలువు దీరింది. అప్పటికే గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. వనంవీడి జనంలోకి వచ్చిన వనదేవతలను దర్శించుకునేందుకు దేశం నలుమూలలనుంచి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి.