బీఆర్​ఎస్​ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయ్​: సీఎం కేసీఆర్​

బీఆర్​ఎస్​ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయ్​: సీఎం కేసీఆర్​

బీఆర్​ఎస్ పార్టీ అమ్ములపొదిలో ఇంకా చాలా ఎన్నికల హామీల అస్ర్తాలున్నాయని సీఎం కేసీఆర్​అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ నేతలపై సీఎం విరుచుకుపడ్డారు. 

కర్ణాటక ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పించి కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోందని సీఎం అన్నారు. హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా సరిపోక.. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​నిధుల్ని మళ్లించి కన్నడనాట హామీల  అమలుకు కాంగ్రెస్​ ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. 

అలాంటి హామీలనే ఇక్కడా ఇద్దామని కాంగ్రెస్​ చూస్తోందని అందులో భాగంగా పింఛన్లు రూ.4 వేలకు పెంచినట్లు ఖమ్మం సభలో ప్రకటించారని చెప్పారు. 2018లో రూ.2 లక్షల రుణమాఫీ అన్నప్పుడే కాంగ్రెస్​ని ప్రజలు విశ్వసించలేదని పేర్కొన్నారు.