మిషన్ భగీరథ వెనుక చాలా పెద్ద కథ ఉంది: కేసీఆర్

మిషన్ భగీరథ వెనుక చాలా పెద్ద కథ ఉంది: కేసీఆర్

రాష్ట్రంలో మిషన్ భగీరథ స్కీం  అమలు  వెనుక ఎంతో కృషి, సాహసం పట్టుదల ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. మిషన్ భగీరథ స్కీం అమలు గురించి వివరించారు. ఇవాళ ఇంటింటికి నల్లా నీళ్లు వస్తున్నాయని అందరు సింపుల్ గా మాట్లాడుకుంటున్నారు కానీ..ఈ పథకం అమలు వెనుక చాలా పెద్ద కథ ఉందన్నారు.  

సిద్ధిపేటలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ ఇంజినీర్ గా ఉన్నటువంటి ఇంద్రసేన రెడ్డి ఇచ్చిన సలహాతో  అద్భుతమైన స్కీంను అమలు చేశామని కేసీఆర్ చెప్పారు. అయితే అదే స్కీంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పైపులు 2లక్షల కి.మీ మేర ఉన్నాయని..  40వేల ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్స్ ఉంటాయన్నారు.  కరెంట్‌ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా మిషన్‌ భగీరథ జలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. ఇదంతా ఎన్ని రాత్రింబవళ్లు పాలకులు, అధికారులు అంకితభావంతో కష్టపడటం వల్లే సాధ్యమయ్యిందన్నారు.