జాతీయ నేతలతో కేసీఆర్ చర్చలు

జాతీయ నేతలతో కేసీఆర్ చర్చలు

దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మంతనాలు జరుపుతున్నారు. శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ మాట్లాడారు.. కేంద్రం వ్యతిరేక విధానాలపై జాతీయ నేతలతో ఆయన చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్, యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు సీఎం కేసీఆర్.

కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. కేంద్రం మెడలు వంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా.. అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు కేసీఆర్ మంతనాలు చేస్తున్నారు. అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే.. ఇటు బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికలపై పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతోంది.