రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు.. 4న కేసీఆర్ కేబినెట్ భేటీ

రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు.. 4న కేసీఆర్ కేబినెట్ భేటీ

డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు  సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్  అధ్యక్షతన ఈ  కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేబినెట్ సమావేశానికి సంబంధించి సీఎంవో ప్రకటన రిలీజ్ చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటిగ్ జరగనుంది. ఈ క్రమంలో కేబినెట్ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  చాలా ఎగ్జిట్ పోల్స్  కాంగ్రెస్ దే అధికారం అని వెల్లడించాయి. అసలు రిజల్ట్ ఏం వస్తుంది.. ఇపుడున్న కేబినెట్ మంత్రులందరూ ఎన్నికల్లో గెలుస్తారా?  అని బీఆర్ఎస్ నేతలు  టెన్షన్ పడుతుంటే .. ఇలాంటి పరిస్థితుల్లో  కేసీఆర్ కేబినెట్ భేటీ ఏంటని షాకవుతున్నారు. 

మరో వైపు  కాసేపటి క్రితం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై చర్చించిన కేసీఆర్ ఫలితాలపై నేతలకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందని ..ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది.