కె.విశ్వనాథ్ కు సీఎం కేసీఆర్ పరామర్శ

కె.విశ్వనాథ్ కు సీఎం కేసీఆర్ పరామర్శ

తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ ను .. ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్. కొన్ని రోజులుగా విశ్వనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశ్వనాథ్ ను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లిన కేసీఆర్… ఆయన యోగ క్షేమాలను అడిగి తెల్సుకున్నారు.  హైదరాబాద్ ఫిల్మ్ నగర్, సాయి నగర్ రోడ్డు నంబర్ 10 లో వున్న కె.విశ్వనాథ్ ఇంటికి సీఎం రాక సందర్భంగా.. ఆ మార్గంలో సెక్యూరిటీ పెంచారు.