ఇతర పంటల సాగుపై కూడా దృష్టి పెట్టాలె

ఇతర పంటల సాగుపై కూడా దృష్టి పెట్టాలె

వ‌న‌ప‌ర్తి : రైతులు ఒక్క వరి కాకుండా ఇతర పంటల సాగుపై కూడా దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ వెళ్తూ.. ఆకస్మికంగా మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ దగ్గర ఆగిన సీఎం కేసీఆర్ రోడ్డు నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్లి మహేశ్వర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలన్నారు.