ఆర్టీసీ కార్మికుల్లారా ఆరుదాటితే అంతే

ఆర్టీసీ కార్మికుల్లారా ఆరుదాటితే అంతే

శనివారం సాయంత్రం 6 గంటలలోపు విధుల్లో చేరని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకునేది లేదని ముఖ్యమంత్రి  కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికసంఘాల డిమాండ్లను త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమ్మెసైరన్ మోగడంతో కేసీఆర్  రవాణాశాఖ మంత్రి, సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ శనివారం సాయంత్రం ఆరుగంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని సూచించారు. లేదంటే తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు నాయకుల ఉచ్చులోపడి కార్మికులు తమ ఉద్యోగాల్ని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం సూచించారు.