
ముఖ్యమంత్రి కేసీఆర్… ముంబై బయల్దేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించనున్నారు. ముందుగా రాజ్ భవన్ కు వెళ్లి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నివాసానికి వెళ్తారు. ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావాలని ఫడ్నవీస్ ను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు సీఎం కేసీఆర్.
నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు..
మహారాష్ట్ర నుంచి సక్కగ.. ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. ఐతే శుక్రవారం రాత్రే సీఎం ఢిల్లీ చేరుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్లో మార్పులు జరిగితే శనివారం ఉదయం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని సమాచారం. ఇక ఆదివారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరినట్టు తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం సీఎం హైదరాబాద్ వస్తారని తెలుస్తుంది.