నాలుగు జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభం

నాలుగు జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభం
  • జిల్లాల టూర్‌‌కు కేసీఆర్‌‌
  • నాలుగు జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభం
  • బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు :  సీఎం కేసీఆర్‌‌ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నాలుగు జిల్లాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు కొంగరకలాన్‌‌లో రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్‌‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. 29న పెద్దపల్లి కలెక్టరేట్‌‌, సెప్టెంబర్‌‌ 5న నిజామాబాద్‌‌, 10న జగిత్యాల జిల్లా కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. అన్ని చోట్ల భారీగా జన సమీకరణ చేసి బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్‌‌, మేడ్చల్‌‌ మల్కాజ్​గిరి కలెక్టరేట్లను కేసీఆర్‌‌ ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్లను ఈఏడాది చివరి నాటికి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.