కొత్త ఏడాది దేశ ప్రజల్లో గుణాత్మక మార్పు తేవాలి : సీఎం కేసీఆర్‌‌

కొత్త ఏడాది దేశ ప్రజల్లో గుణాత్మక మార్పు తేవాలి : సీఎం కేసీఆర్‌‌

కొత్త ఏడాది దేశ ప్రజల్లో గుణాత్మక మార్పు తేవాలి
న్యూ ఇయర్​ విషెస్​ చెప్పిన కేసీఆర్​ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజలందరి జీవితాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా ఈ సంవత్సరం నిలవాలని సీఎం కేసీఆర్‌‌ ఆకాంక్షించారు. దేశ ప్రజలకు ఆయన ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

గతాన్ని సమీక్షించుకుంటూ.. వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ.. భవిష్యత్‌‌ను అన్వయించుకుంటూ జీవితాలను గుణాత్మకంగా తీర్చిదిద్దు కోవడం ద్వారా నూతనత్వం సంతరిస్తుందన్నారు. నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఆదర్శనీయమన్నారు.