
- ఉమ్మడి ఖమ్మంలోనే మూడు సీట్లు ఉన్నాయనే చర్చ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సీపీఐ రాష్ట్ర నేతలతో ఇటీవల కేసీఆర్జరిపిన చర్చలు మునుగోడు ఎన్నికలకే పరిమితం కావని, భవిష్యత్‌లోనూ పొత్తులు కొనసాగుతాయంటూ తాజాగా సీఎం చేసిన కామెంట్ పొలిటికల్వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పొత్తుల సందర్భంగా సీపీఐ నేతలు చేసిన పలు ప్రతిపాదనలకు కేసీఆర్ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆరు సీట్లు కావాలని సీపీఐ లీడర్లు అడగగా, అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మూడు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఆ సీట్లు ఇవే..
బీజేపీని ఓడించేందుకు భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో పొత్తులుంటాయని సీఎం కేసీఆర్మునుగోడులో ప్రకటించారు. బహిరంగ సభ వేదికపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా కూర్చున్నారు. ఏరకంగా చూసినా పొత్తు ఖాయమని తేలడంతో టీఆర్ఎస్ సీపీఐకి వదిలేయబోయే సీట్లు ఏవనే చర్చ మొదలైంది. వేదికపై కూర్చున్న కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ఆశిస్తున్నారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంతోపాటు, భద్రాచలం/పినపాక, ఖమ్మం జిల్లాలోని వైరా, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నల్గొండ జిల్లాలోని దేవరకొండ, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ సీట్లను తమకు కేటాయించాలని సీపీఐ కేసీఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆయా సీట్లతో పెద్ద సమస్య లేనప్పటికీ హుస్నాబాద్ సెగ్మెంట్‌ను చాడ వెంకటరెడ్డికి ఇస్తారా లేదా? అనేదానిపై అనుమానాలున్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్నుంచి కేసీఆర్కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వొడితెల లక్ష్మీకాంతారావు కుమారుడు సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ వెంకటరెడ్డికి హుస్నాబాద్ కేటాయిస్తే సతీశ్‌బాబుకు హుజూరాబాద్ టికెట్ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం సీట్లపై సానుకూలత
మిగిలిన సీట్ల సంగతి పక్కనపెడ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐకి కేటాయించేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్కు చెందిన వనమా వెంకటేశ్వరరావు, వైరా ఎమ్మెల్యేగా రాములు నాయక్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కొత్తగూడెం నుంచి తానే పోటీ చేస్తానని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నప్పటికీ వనమా రాఘవ వ్యవహారం ఆయనకు మైనస్‌గా మారిందని టీఆర్‌ఎస్‌వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో డీహెచ్గడల శ్రీనివాస్టీఆర్ఎస్ నుంచి టికెట్ఆశిస్తున్నారు. డాక్టర్ జీఎస్ఆర్ పేరుతో ట్రస్టు పెట్టి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గడలకు సీటు కేటాయింపుపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది. కానీ ఇటీవల ఆయన కూతురి వివాహానికి టీఆర్ఎస్ ప్రముఖులెవరూ హాజరుకాకపోవడంతో ఆయనపై హైకమాండ్ఆలోచన ఏమిటనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు వైరా సీటుపై సిట్టింగ్ఎమ్మెల్యే రాములు నాయక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా ఈ రెండు సీట్లు సీపీఐకి కేటాయిస్తే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆయా పార్టీల సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.