ఫ్రీగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ : సీఎం ఆదేశం

ఫ్రీగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ : సీఎం ఆదేశం

ఫెయిలైన వారికి ప్రభుత్వం వెసులుబాటు

ఫెయిలైన వారికి ఉచితంగా రీ కౌంటింగ్- రీ వెరిఫికేషన్ 

పాస్ అయినవారికి ఇప్పుడున్న నిబంధనలు అమలు

సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి KCR అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

బాధ్యత బి.జనార్ధన్ రెడ్డికి అప్పగింత

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు : సీఎం

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం అని సీఎం అన్నారు. ఇంటర్మీడియట్ లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.