రాత్రికి రాత్రే సీఎం పీఆర్వో రాజీనామా.. కారణమదేనా?

రాత్రికి రాత్రే సీఎం పీఆర్వో రాజీనామా.. కారణమదేనా?
  • సీఎం పీఆర్వో రాజీనామా
  • ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో జీఎం పోస్టుకూ రిజైన్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్​ పీఆర్వో గటిక విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ రాజీనామా చేశారు. పీఆర్​వోతోపాటు ట్రాన్స్​కో జీఎం (కమ్యూనికేషన్)గా కొనసాగుతున్న ఆయన ఆ ఉద్యోగానికి కూడా రిజైన్​ చేశారు. కొంతకాలంగా ఆయన వ్యవహారశైలిపై ఫిర్యాదులు రావడంతో సీఎం కేసీఆర్ రాత్రికిరాత్రి ఆయనతో రాజీనామా చేయించారని ప్రగతిభవన్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎంవో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. ట్రాన్స్​కో జీఎం పోస్టుకు విజయ్​కుమార్​ రిజైన్​ చేసిన విషయాన్ని ట్రాన్స్​కో ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో  రాజీనామా చేసినట్లు విజయ్​కుమార్ బుధవారం ఉదయమే​ ఫేస్​బుక్ ​లో పోస్ట్ చేశారు. వరంగల్‌‌‌‌ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుగా పనిచేసిన విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం పీఆర్​వోగా జాయిన్​ అయ్యారు. అప్పటి నుంచి మీడియా వ్యవహారాల్లో కేసీఆర్‌‌‌‌కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.