ఖైరతాబాద్​ గణేశ్​ పూజకు రండి

ఖైరతాబాద్​ గణేశ్​ పూజకు రండి
  • గవర్నర్​కు ఉత్సవ కమిటీ ఆహ్వానం 

ఖైరతాబాద్, వెలుగు : ఖైరతాబాద్​లోని​ శ్రీ సప్త ముఖ మహా శక్తి  గణపతి పూజకు హాజరు కావాలని గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మకు ఖైరతాబాద్​గణేశ్​ఉత్సవ అడహాక్​ కమిటీ ఆహ్వానం పలికింది. బుధవారం రాజ్​భవన్​కు ​ వెళ్లిన కమిటీ ప్రెసిడెంట్, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్​ రాజ్​కుమార్​ ఆధ్వర్యంలోని బృందం గవర్నర్​కు ఆహ్వాన పత్రిక అందజేసింది.  అడహక్​ కమిటీ సభ్యులు లక్ష్మణ్​యాదవ్​, జి.కృష్ణయాదవ్​, మహేశ్ యాదవ్​, అశోక్​, మహేందర్​బాబు, పృథ్వీరాజ్ ఉన్నారు. 

బాలాపూర్ గణేశ్​ వద్ద కట్టుదిట్టమైన భద్రత : సీపీ సుధీర్​బాబు

ఎల్బీనగర్ : బాలాపూర్ వినాయకుడి మండపం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సీఎం ఆదేశాలతో సీసీ కెమెరాలు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక పార్కింగ్​ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, బాలాపూర్ సీఐ, బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పారిజాతనర్సింహారెడ్డి బాలాపూర్ గణేశ్​ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లం నిరంజన్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మండపం వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.