
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా రేగడి మైల్వార్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త నర్సిరెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందగా.. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నర్సిరెడ్డి ఇంటికి వెళ్లి అయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటానని అధైర్య పడొద్దని నర్సిరెడ్డి భార్య యాదమ్మకు భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రాంమోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.