ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ... సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ... సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేటలో జరుగుతున్న జనజాతర సభలో సీఎం రేవంత్ పంట రుణాల మాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న కారణంగానే రుణమాఫీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వడ్లకు సంబంధించి రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో ప్రధాని మోడీ, కేసీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు రేవంత్.బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అంటున్నారని ఎందుకు ఓడించాలో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ విద్వాంసాలు సృష్టించారని అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఇదేమైన రాచరికపు వ్యవస్థనా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డలు ముఖ్యమంత్రులు కావద్దా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.