
అధికారులు ప్రజలతో ఉంటేనే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే.. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ప్రెండ్లీ గవర్నమెంట్ అంటే అధికారులు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే” అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా.. లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటినీ సమీక్షిస్తుందన్నారు.
అఖిల భారత సర్వీసెస్ అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు ఎస్.ఆర్. శంకర్‌ను గుర్తు చేసుకోవాలి. ఆయన జీవిత కాలం సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆయనసేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయారు” అని సీఎం గుర్తుచేశారు.