ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సిమిట్ ఈవెంట్ కు ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం.. మంగళవారం (డిసెంబర్ 03) ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో గ్లోబల్ సమిట్ గురించి మోదీకి వివరించారు. గ్లోబల్ సమిట్ కు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం రేవంత్.
అంతకు ముందు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన సీఎం.. గ్లోబల్ సమిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పార్లమెంటులో భేటీ అయ్యారు సీఎం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కు ఆహ్వానించారు. అంతకు ముందు సోమవారం (డిసెంబర్ 02) రాత్రి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి సమిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, కావ్య, అనిల్ కుమార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
