అమీర్ పేటలో తీరనున్న వరద కష్టాలు... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనులు స్పీడప్

అమీర్ పేటలో తీరనున్న వరద కష్టాలు... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనులు స్పీడప్
  • కన్సల్టెన్సీ దక్కించుకున్న ఎన్సీపీ సంస్థ
  • నెల రోజుల్లో బల్దియాకు రిపోర్ట్     
  • డీపీఆర్ ఫైనల్ కాగానే టెండర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్​పేట ప్రాంతాల్లో వరద సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. భారీ వర్షాలతో ఇక్కడ వరద నీరు నిలిచిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి వారం క్రితం పర్యటించి, శాశ్వత పరిష్కారం కోసం అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలపై బల్దియా అధికారుల ఫోకస్ పెట్టారు. భారీ వర్షాలు కురిసిన కూడా ఇక్కడ నీరు నిల్వకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై కన్సల్టెన్సీ టెండర్లను పిలిచింది. 

ఈ నెల 11న టెండర్లు ఆహ్వానించగా, 14న ఓపెన్ చేశారు. టెండర్లలో ఎన్సీపీ సంస్థ పాల్గొనడంతో ఈ సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి గంగుబాయిబస్తీ, బుద్ధనగర్, కృష్ణకాంత్ పార్క్, మధురానగర్, హర్ష మెస్, ఆదిత్య ట్రేడ్ సెంటర్ నుంచి సత్యం థియేటర్ వరకు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ నెట్‌వర్క్ కోసం సర్వే ప్రారంభమైంది. నెల రోజుల్లో డీపీఆర్ సమర్పించనున్న ఎన్సీపీ రిపోర్ట్ ఆధారంగా నిర్మాణ ఖర్చు అంచనా, టెండర్లు వేసి, వచ్చే నెలాఖరులో పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తున్నది.