ప్రజాపాలనలో ఎవరైనా ధర్మ గంట కొడితే.. వారి సమస్యలు పరిష్కరిస్తున్నం: సీఎం రేవంత్

  ప్రజాపాలనలో ఎవరైనా  ధర్మ గంట కొడితే.. వారి  సమస్యలు పరిష్కరిస్తున్నం: సీఎం రేవంత్

ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘బాల భరోసా’ పథకాన్ని, వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు ‘ప్రణామ్’ను సీఎం రేవంత్ ప్రారంభించారు. రూ.50 కోట్లతో దివ్యాంగులకు సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల పక్షాన తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడిలా నిలబడుతుందని, మానవీయ కోణంలో పాలన సాగిస్తామని భరోసా ఇచ్చారు.
 
 ఈ సందర్భంగా .. గతంలో సెక్రటేరియెట్ గేట్ల బయట గద్దర్ వంటి వారు ఎర్రటి ఎండలో గంటల తరబడి వేచి ఉన్నా లోపలికి అనుమతి దొరకలేదని, కానీ.. నేడు సామాన్యులు, దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లు దర్జాగా ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. కేవలం కొందరి శ్రీమంతులకే పరిమితమైన ప్రదేశాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సమస్యలున్న వారు ఎవరైనా వచ్చి ‘ధర్మగంట’ కొడితే ప్రభుత్వం వింటుందని భరోసా ఇచ్చారు. ప్రతి వారం ప్రజావాణి నిర్వహించి మంత్రులు, ఐఏఎస్ అధికారులతో లక్షలాది సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. 40 ఏండ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ (ఏబీసీడీ) చేసి సామాజిక న్యాయం చేశామని, కొంచెం అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఇది మేలు చేస్తుందన్నారు.