- లోక్‌భవన్‌లో ఓపెన్ హౌస్
- భారీగా తరలివచ్చిన ప్రజలు,
- స్వచ్ఛంద సంస్థ లప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం లోక్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అలాగే, మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి దంపతులు, జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎస్, డీజీపీ, సీపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు వివిధ శాఖల ఉన్నతాధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లోక్ భవన్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించగా ప్రజలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చి, గవర్నర్‌కు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు డిజిటల్ అసిస్టివ్ డివైజ్‌లను పంపిణీ చేశారు. వెనుకబడిన వర్గాల స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు. దివ్యాంగులకు, స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్‌ల కోసం సాయం అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ (తెలంగాణ బ్రాంచ్), మన అమెరికా తెలుగు అసోసియేషన్, సంకల్ప్ ఫౌండేషన్లకు గవర్నర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. లోక్ భవన్ నుంచి బాసర ఆర్జేయూకేటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ ఎంట్రపెన్యువర్ షిప్ డెవలప్‌మెంట్(ఐఐఈడీ) సెల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్, ఫ్యాకల్టీ, సెల్ నిర్వహకులతో గవర్నర్ మాట్లాడారు. ఈసెల్ ఏర్పాటుకు గవర్నర్ తన సొంత నిధుల నుంచి ఫండ్స్ మంజూరు చేశారు. ఇన్నోవేటర్లు, ఎంట్రపెన్యూర్స్‌తో రూరల్ యువతలో టెక్నికల్ స్కిల్స్ పెంచడం కోసం ఆర్జేయూకేటీలో ఈ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు గవర్నర్ తెలిపారు. రానున్న రోజుల్లో వికసిత్ భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా ఆర్జేయూకేటీ బాసర మారుతుందన్న నమ్మకం తనకు ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సెల్‌కు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
