నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని నగర పాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలకు చెందిన ముసాయిదా ఓటర్ లిస్టు గురువారం విడుదల చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వార్డుల సంఖ్యతో పాటు ఓటర్ లిస్ట్‌ను ప్రకటించారు. ఈనెల 5న పొలిటికల్ పార్టీలతో మీటింగ్ నిర్వహించి వీటిపై అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. 6న ఆఫీసర్లు సమావేశం తర్వాత 10న ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు.
బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా, 69,810 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 33, 881 మంది, పురుషులు 35,929 మంది ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ లో 36 వార్డులు ఉండగా, 64,165 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 33,428 మంది, పురుషులు 30,735 మంది, ఇతరులు 02 ఉన్నారు.
భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, 14,189 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 7,502 మంది, పురుషులు 6,687 మంది ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాబితా ఇంకా రాలేదు.
కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను గురువారం అధికారులు విడుదల చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో 99,555 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 48,511 మంది, మహిళలు 51,027 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 13,283 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో పురుషులు 6,328 మంది, మహిళలు 6,954 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో ఓటరు లిస్టుపై అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించిన అనంతరం ఈనెల 10న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
