సీఎం సంకల్పంతోనే దేవాలయాల అభివృద్ధి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్

 సీఎం సంకల్పంతోనే దేవాలయాల అభివృద్ధి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్
  •     న్యూ ఇయర్​ సందర్భంగా భీమన్నను దర్శించుకున్న మంత్రి, విప్​

వేములవాడ, వెలుగు :  ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సంకల్పంతోనే రాష్ట్రంలో దేవాలయలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. న్యూ ఇయర్​ సందర్భంగా గురువారం రాజన్న అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని కోడె మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేయడానికి మరింత ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఇవ్వాలని దేవుడిని వేడుకున్నానన్నారు.

 సీఎం సంకల్పంతో రాజన్న ఆలయాన్ని పునర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిర్మాణం, మేడారం సమక్క–సారలమ్మ ఆలయ పునర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రాజన్న ఆలయం పనులు పూర్తయ్యాక కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు అభివృద్ధి చేస్తామని సీఎం మాట ఇచ్చారన్నారు. విప్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇరుగ్గా ఉన్న రాజన్న ఆలయాన్ని రూ.150కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​రొండి రాజు, పుల్కం రాజు, కనికరపు రాకేశ్‌‌‌‌‌‌‌‌, బింగి మహేశ్‌‌‌‌‌‌‌‌, తోట రాజు, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

న్యూ ఇయర్ వేడుకలకు హాజరు 

వేములవాడ పట్టణంలోని 26వ వార్డులో కాంగ్రెస్ నాయకులు సిర్రం ప్రసాద్‌‌‌‌‌‌‌‌యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న్యూ ఇయర్ 2026 క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. అలాగే తిప్పపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆటో యూనియన్​ అధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు.