గోదావరిఖని, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. జనవరి 1 నుంచి 31వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై రూపొందించిన ‘అరైవ్ -అలైవ్’ పోస్టర్‌ను సీపీ గురువారం తన ఆఫీస్‌లో అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
