కోర్టు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి : బార్ అసోసియేషన్ న్యాయవాదులు

కోర్టు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి : బార్ అసోసియేషన్ న్యాయవాదులు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలో కోర్టు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని, ప్రత్యేకంగా జడ్జిని నియమించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు. నిర్మల్ జిల్లా పోర్టుఫోలియో, హైకోర్ట్ జడ్జి జస్టిస్ సుజన, హైకోర్ట్ భవన నిర్మాణ కమిటీ మెంబర్ జస్టిస్ విజయసేనారెడ్డికి ఖానాపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంత్రరాజం సురేశ్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు వినతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖానాపూర్ కోర్టులో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందని, కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోందన్నారు. ప్రస్తుతమున్న కోర్టుకు విద్యుత్ పవర్ జనరేటర్, ఈ- కోర్టుల పరికరాలు మంజూరు చేయాలని కోరారు. కక్షిదారుల కోసం ప్రత్యేకంగా గదులు నిర్మించాలన్నారు. ఖానాపూర్ లోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఐదెకరాల ఖాళీ స్థలం ఉందని, అందులో కోర్టు భవనాలు నిర్మించాలని కోరారు. న్యాయవాదులు సత్యనారాయణ, వేణుగోపాల్,  రవి, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.