జనగామ అర్బన్, వెలుగు : ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని, ఈనెలలో జరిగే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం తన ఛాంబర్లో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ ఈనెల1 నుంచి 31 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్ సేప్టీ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు.
ఎంఈవోస్, సీహెచ్ఎంస్, సీపీఆర్పీస్ వారి పాఠశాల సందర్శనలో ప్రత్యేక కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమాల డిజిటల్ డాక్యుమెంటేషన్ ను రూపొందించి వాట్సాప్ ద్వారా జిల్లా ఆఫీస్కు పంపాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రతిఒక్కరికీ రోడ్డు భద్రతా నిబంధనలు తెలియజేయాలన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
భూపాలపల్లి రూరల్, వెలుగు: ప్రతిఒక్కరూ ట్రాఫిక్నిబంధనలు పాటించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రతను సరదాగా తీసుకోవద్దని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీవో సంధాని మహ్మద్, ఎస్సైజ్ ఈఎస్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ ప్రసాద్, ఉద్యాన అధికారి సునీల్, యువజన సర్వీసులు శాఖ అధికారి రఘు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
సమష్టిగా రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం
ములుగు, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ను ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31 వరకు జాతీయ రో భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేశ్, ఆర్టీవో శ్రీనివాస్, ఏఎంవీఐ వినోద్, అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..
మహబూబాబాద్, వెలుగు : రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ను మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియామాలు ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీవో జైపాల్ రెడ్డి, ఎంవీఐ సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
