- డిసెంబర్ లో రూ. 80 కోట్ల మద్యం అమ్మకాలు
- గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగిన అమ్మకాలు
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ స్థానం
జయశంకర్భూపాలపల్లి, వెలుగు : కోల్ బెల్ట్ ఏరియాలో మద్యం సేల్స్ కిక్ నిచ్చాయి. ఒక్క రోజులోనే భూపాలపల్లి ఎక్సైజ్సూపరిండెంట్ పరిధిలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి రూ.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ లో మొత్తం మీద రెండు జిల్లాల్లో రూ.80 కోట్ల మద్యం అమ్మారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 45 శాతం మద్యం సేల్స్ తో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, భూపాలపల్లి, ములుగు జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి.
గతేడాది డిసెంబర్ లో రూ.57 కోట్ల మద్యం సేల్స్ జరగగా, ఈసారి రూ.80 కోట్ల సేల్స్ తో మద్యం వ్యాపారులకు కాసుల పంట పండింది. స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, క్రిస్మస్, వీకెండ్ ఈవెంట్లు, నూతన సంవత్సర వేడుకలతో మద్యం సేల్స్ విపరీతంగా పెరిగాయి. మొదటి నెలలోనే మద్యం సేల్స్ పెరగడంతో లిక్కర్ వ్యాపారులు ఖుషీ అయ్యారు.
