త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన వైపు అడుగులేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  సెక్రటేరియెట్ లో పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ధర్నాచౌక్ ను తిరిగి తెరిపించి.. ప్రజా ఉద్యమాలకు అవకాశం కల్పించామన్నారు. ప్రజాభవన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు  రేవంత్ రెడ్డి. త్వరలోనే రెండు కమిషన్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మన విద్యావిధానంఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

25 ఎకరాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు సీఎం రేవంత్. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కుల, మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమన్నారు  రేవంత్ రెడ్డి. పంటల బీమా పథకాన్ని పకడ్బంధీగా అమలు చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడిని తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతున్నామని ప్రకటించారు. 

ALSO READ :- ట్రేడింగ్ పేరుతో 2 నెలల్లో రూ. 27 కోట్లు స్వాహా


కౌలురైతుల రక్షణకు సబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిచారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని చెప్పారు. రైతుభరోసా అనేది పెట్టుబడి సాయం..రైతుభరోసా ఎవరికి ఇవ్వాలనేదానిపై విస్తృత చర్చ జరగాలన్నారు రేవంత్ రెడ్డి. నిస్సహాయులకు, నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పినదానికంటే ఎక్కువ సాయం చేస్తామన్నారు సీఎం రేవంత్.