మాదిగల డిమాండ్లను పరిష్కరిస్తాం

మాదిగల డిమాండ్లను పరిష్కరిస్తాం
  •      సీఎం రేవంత్ రెడ్డి హామీ

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మాదిగల సమస్యలు పరిష్కరిస్తానని, డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో చైర్మన్ పోకల కిరణ్ మాదిగ నేతృతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. అనంతరం పోకల కిరణ్ మాట్లాడుతూ..  జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రాజ్యసభ, రెండు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు చైర్మన్ల పదవులు ఇవ్వాలని కోరామన్నారు. 

అధికారంలో మాదిగలకు భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరినట్లు చెప్పారు. సీఎం రేవంత్ స్పందిస్తూ.. కీలకమైన పదవులు ఇచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 17 లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే విధంగా మహాకూటమి ముందుకు వెళ్తుందని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో కూటమి ముఖ్య సలహాదారులు సంగీతపు రాజలింగం, మాస్టర్ జి,వశపాక నరసింహ, లాయర్ మల్లన్న, ఆరేపల్లి రాజేందర్, గ్యార శీను తదితరులు పాల్గొన్నారు.